• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Tuesday, August 18, 2020

#ప్రభాస్ 22 వ చిత్రం.....!



ఎట్టకేలకు ప్రభాస్ తన సర్ ప్రైస్ రివిల్ చేశాడు బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసాడు  T సిరీస్ నిర్మించబోతున్న #ADIPURUSH అనే మూవీలో ప్రభాస్ నటించబోతున్నట్లు ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రభాస్ తన ఇన్స్ట్రాగ్రామ్ లో వీడియో షేర్ చేశారు

#చిరంజీవి 152 వ చిత్రం...!




 చిరంజీవి 152 చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆగస్టు 22 సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు #we are ready with first look and motion poster of#chiru152.meet you on August 22nd at 4pm!! అని ఆయన ట్వీట్ చేశారు

Monday, August 17, 2020

#ప్రభాస్ సర్ ప్రైజ్...!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చాలా క్రేజ్ సంపాదించిన ఈ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ నుండి సర్ప్రైస్ రాబోతుంది రేపు ఉదయం 7:11 నిమిషాలకు తనకు సంబంధించి సర్ ప్రైజ్ ఉంటుందని  ఇన్స్ట్రా  గ్రామ్ లో ఒక చిన్న వీడియో షేర్ చేశాడు ప్రభాస్ అయితే బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ సినిమా తీస్తున్నాడని... హృతిక్ రోషన్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నానని , ఈ సినిమాను T సిరీస్ నిర్మిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి

ప్రముఖ సంగీత విద్వాంసుడు..పండిట్ జస్ రాజ్ కన్ను మూత...!




భారతీయ సాహిత్య గాయకుడు అత్యుత్తమ గౌరవ పద్మ విభూషణ్ గ్రహీత 8 దశాబ్దాలుగా గాయకుడు పండిత్   జస్ రాజ్ గారు ఈరోజు పరమవదించారు

దంచికొడుతున్న వానలు 868 మంది మృతి!



దేశంలో వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా కురుస్తున్న వానలు దీంతో జులై నెల చివర్లో నమోదైన వర్షపాత లోటును తుడిచిపెట్టేల విపరీతంగా వానలు కురుస్తున్నాయి నాలుగు నెలల సీజన్ లో నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా103% గా ఉంది ఆగస్టు19 న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ( ఐఎండి )తెలిపింది దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గతంలో కురిసిన వర్షాలకు అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, మేఘాల‌యాలోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షభీబ‌త్సం చాలామందిని బ‌లిగొన్న సంగ‌తి తెలిసిందే. భారీ వర్షం కారణంగా కేరళలో కొండచరియలు విరిగిపడి 55 మంది మృతి చెందారుఆగ‌స్టు 12 నాటికి దేశంలోని 11 రాష్ర్టాల్లో కురిసిన  భారీ వ‌ర్షాల కార‌ణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మంత్రిత్వ శాఖ నివేదిక‌లో వెల్ల‌డించింది. గ‌త ఏడాది ఇదే సీజ‌న్‌లో 908 మంది చ‌నిపోయారు. ఈ సంవ‌త్స‌రం కూడా అసాధార‌ణ‌మైన వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. జైపూర్ లోని ఓ ప్రాంతంలో కేవ‌లం ఆరు గంట‌ల స‌మ‌యంలోనే 25 సెం.మీ. వ‌ర్షం న‌మోద‌వ‌గా ,  గ‌త 24 గంట‌ల్లో రాజ‌స్తాన్,ఒడిశా, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాలు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ సీనియ‌ర్ శాస్త్రవేత్త ఆర్.కె. జెనమణి అన్నారు.ఆగ‌స్టు నెల‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు మూడు అల్ప‌పీడ‌నాలు ఏర్ప‌డ్డాయి. హిమాల‌యాల నుంచి రుతుప‌వ‌నాలు వేగంగా వీస్తున్నాయ‌ని దీంతో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు

Sunday, August 16, 2020

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలి !

రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి ఇవాళ్ళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వరంగల్, భూపాలపల్లి, ములుగు ,అదిలాబాద్, కొమరం భీమ్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల్, జగిత్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని ఈ జిల్లాల వారు వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది

Saturday, August 15, 2020

అంతర్జాతీయ క్రికెట్ కు ధోని గుడ్ బై!

 అంతర్జాతీయ క్రికెట్ కి ధోని గుడ్ బై చెప్పారు ఇంతకుముందు ధోనీ రిటైర్మెంట్ పై అనేక  రూమర్స్ వచ్చాయ్ కానీ ధోనిి తాజాగా  తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇన్ని రోజులు తాను భారత క్రికెట్ టీం కు అందించిన సేవలు ఇక ముగిసాయి తనను అభిమానించే అభిమానులుు అందరికీ ఆయన ధన్యవాదాలుు తెలిపారు  ధోని తాజాగా ఈ ఏడాది జరిగే టి20  వరల్డ్ కప్ ఆడతారనిి అందరూ భావించారు కానీ కరోనా నేపథ్యంలో అది వాయిదా  పడడంతో ధోని తన రిటైర్మెంట్ కై నిర్ణయంం తీసుకున్నారు ధోనీ రిటైర్మెంట్ పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు

Friday, August 14, 2020

ప్రభాస్ పారితోషికం రికార్డ్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో కొత్త రికార్డు సృష్టించాడు అయితే ఇప్పుడు ఇది కలెక్షన్స్ విషయంలో కాదు  రెమ్యునేషన్ విషయంలో బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాలు అన్ని భాషల్లోకి అనువదించబడుతున్నాయి అక్కడ కూడా హిట్ టాక్ సంపాదించుకుంటున్నయి అతను బాహుబలి తర్వాత తీసిన సాహో చిత్రం అనుకున్నంత పెద్ద హిట్ కాకపోయినా కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న 21 వ చిత్రం 'మహానటి' డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు దీనికిగాను ప్రభాస్ 100 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాట్లు తెలుస్తుంది సినిమాకు ఇచ్చేది 70 కోట్లు కాగా డబ్బింగ్ రైట్స్ కోసం మరో 30 కోట్లు ఇవ్వనున్నట్లు టాలీవుడ్ సమాచారం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంది సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రమే దర్బార్ సినిమాకు గాను ఆయన 70 కోట్ల పారితోషికం అందుకున్నారు ఇప్పుడు ప్రభాస్ ఆయనని మించిపోయారు

Tuesday, February 4, 2020

అఖిల్ కొత్త చిత్రం టైటిల్ ఖరారు : “ బ్యాచ్ లర్ “ ఫస్ట్ లుక్ ఆసక్తి కరంగా ఉంది.



యువ సామ్రాట్ నాగార్జున చిన్నబ్బాయి అక్కినేని అఖిల్ హీరోగా ,బొమ్మ రిల్లు భాస్కర్ దర్శకత్వం లో ,అల్లు అరవింద్ సమర్పణలో ,బన్నీ వాస్ నిర్మాత గా తెరకెక్క బోతున్న చిత్రం టైటిల్ పోస్టర్ ని ఈ రోజు విడుదల చేశారు. ఈ చిత్రం టైటిల్ ని “బ్యాచ్ లర్ గా నిర్ణయించారు.ఈ పోస్టర్ జస్ట్ టైటిల్ మాత్రమే .అఖిల్ ఫస్ట్ లుక్  ని ఫెబ్రవరి 8 వ తేదీన విడుదల చేయనున్నారు.   

వావ్ ...రమ్య కృష్ణ..ఒక అద్భుతం: రవి వర్మ "దమయంతి"గా రమ్య కృష్ణ:: స్టన్నింగ్

రమ్య కష్ణ ఫోటోను ఆమె భర్త కృష్ణ వంశీ ట్విట్టర్ లో   The queen as Ravi Varma's Damayanthi  అని ట్వీట్ చేశాడు.ఈ ఫోటో లో రమ్య కృష్ణ ,లెజెండరీ ఆర్టిస్ట్ రవి వర్మ గీసిన "దమయంతి" గెటప్ లౌంది.ఈ ఫోటో లో నిజంగా రమ్య కృష్ణ చాలా అందంగా ఉంది..పెయింటింగ్ ను మరిపిస్తుంది...ఎంజాయ్..

Monday, February 3, 2020

సంజూ శాంసన్ "సూపర్ మ్యాన్ ఫీల్డింగ్"- ఇలాంటి ఫీట్ ఎవ్వరూ చేయలేరు



న్యూజిలాండ్ తో జరిగిన 5 వ T20 లో భారత ఫీల్డర్ సంజూ శాంసన్ చేసిన ఫీట్..న భూతో న భవి ష్యత్.. శార్దుల్ టాకుర్ ఓవర్లో రాస్ టేలర్ కొట్టిన బంతి ని..సంజూ సిక్స్ కాకుండా ఆపిన విధానం అద్భుతం


అద్భతమైన పాట "ఊహలే ఊహలే"- . చిత్రం ' జాను '


"జాను" ...శర్వానంద్,సమంత హీరో హీరోయిన్ లుగా ,దిల్ రాజు నిర్మించిన సినిమా.దీనికి దర్శత్వం C.ప్రేమ్ కుమార్.తమిళ్ క్లాసిక్ ' మూవీ కి ఇది రీమేక్.తమిళ్ వెర్షన్ చూడని వారు ఇందులోని ప్రతీ సీన్ ని ఎంజాయ్ చేస్తారు.ఇక చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈపాట ఒక అద్భుమైన పాట.తమిళ్ లో 'కాదలే కాదలే' గా వచ్చిన ఈ పాట తప్పక చూడాలి


డ్యాన్స్ తో అదర గొట్టిన నితిన్ :భీష్మ ఫస్ట్ సాంగ్ వాటే బ్యూటీ ట్రెండింగ్




నితిన్ ,రష్మిక లు జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం "భీష్మ" చిత్రం లో నుండి ఫస్ట్ వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ పాట ప్రతుతం youtube లో ట్రెండ్ అవుతుంది .మీరు కూడా చూడండి.
Song: Whattey Beauty Lyrics: Kasarla Shyam Singer: Dhanunjay , Amala Chebolu Cast & Crew: Starring: Nithiin, Rashmika Mandanna Music: Mahati Swara Sagar D.O.P: Sai Sriram Art director: Sahi Suresh Choreography: Jani Master Editor: Navin Nooli Presents: PDV Prasad Producer: Suryadevara Naga Vamsi Written & Directed by Venky Kudumula Banner: Sithara Entertainments

Sunday, February 2, 2020

తప్పక చూడాల్సిన "ఫాస్ట్ and ఫ్యూరియస్ 9" ట్రైలర్ :రేటింగ్ 4.5/5




విన్ డీజిల్ ,హాలీ వుడ్ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అయ్యే సినీ అభిమానులకు ఎంతో సుపరిచిత పేరు .అతడు నటించిన 'ఫాస్ట్ and ఫ్యూరియస్'  సిరీస్ చిత్రాలు ఇప్పటివరకు 8 వచ్చాయి.అన్నీ కూడా బ్లాక్ బస్టర్ లే.ఇప్పుడు రాబోతున్న ఈ తొమ్మిదవ చిత్రం ట్రైలర్ చాలా చాలా బాగుంది.చూస్తేనే అందులో కిక్కు తెలుస్తుంది.ఒక్క సారి చుడండి.మళ్ళీ చూస్తారు. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే WWE ఫేం  " జాన్ సేనా" ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.అయితే అతడు హీరో "డామ్" (విన్ డీజిల్ ) కి తమ్ముడిగా నటిస్తున్నాడు.
Directed byJustin Lin
Produced by
Written byDaniel Casey
Based onCharacters
by Gary Scott Thompson
Starring
Music byBrian Tyler
CinematographyStephen F. Windon
Edited by
  • Christian Wagner
  • Dylan Highsmith
  • Kelly Matsumoto
  • Greg D'Auria
  • Leigh Folsom Boyd
Production
company
Distributed byUniversal Pictures
Release date
  • May 22, 2020 (United States)
CountryUnited States
LanguageEnglish

మంచి సాంగ్ అనిపించుకున్న ప్రదీప్ మాచిరాజు సాంగ్ : రేటింగ్ - 4 /5.




టీవీ యాంకర్ ,నటుడు ప్రదీప్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది. “30 రోజుల్లో ప్రేమించడం ఎలా”   గా రాబోతున్న ఈ సినిమాలో హీరోగా ప్రదీప్ ,హీరొయిన్ గా అమృతా అయ్యర్  నటిస్తుండగా.మున్నా ఈ సినిమా కి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.అయితే ఈ సినిమా లోని " నీలి నీలి ఆకాశం "  సాంగ్ ఇప్పుడు youtube లో హల్చల్ చేస్తుంది.ట్రెండింగ్ లో టాప్ లో ఉంది.ఆ పాట ను సిడ్ శ్రీరాం పాడాడు.పాట బాగుండడం తో పాటు.బాగా చిత్రీకరించారు.చూసి ఎంజాయ్ చేయండి.

హమ్మయ్య అఖిల్ కి ఇక హిట్ గ్యారంటీ




అవును ,యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని కి ఇంత వరకు సరైన హిట్ పడలేదు.ప్రతీ సినిమా విషయం లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎక్కడో తేడా కొడుతుంది.అందుకే తీసిన 3 సినిమాలు సరిగా ఆడ లేదు.నిజానికి అఖిల్ మంచి పెర్ఫార్మార్ ,మంచి డ్యాన్సర్ .అయినా మంచి సినిమా పడలేదంతే.అయితే ఇప్పుడు అక్కినేని అబిమానులకు శుభవార్త ఏంటంటే అల్లు  అరవింద్ నిర్మాణ సారథ్యం లో అఖిల్ 4 వ సినిమా వస్తుంది.ఇది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో వస్తుంది.అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ ఎప్పుడూ రాంగ్ కాదు.సొ ఇక అఖిల్ కి హిట్ గ్యారంటి. అయితే ఈ సినిమా కి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు.పాపం ‘ఆరెంజ్ ‘ తర్వాత అవకాశాలు లేక కొట్టు మిట్టాడుతున్న భాస్కర్ కి కూడా ఇది చాలా ముఖ్యమైన సినిమా.కాబట్టి చాలా మచి కథ నే అయి ఉంటుంది.ఈ సినిమా టైటిల్ ని 4 వ తేదీ సాయంత్రం 5.15 కి అనౌన్స్ చేయనున్నారు.  పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి బన్నీ వాసు  & వాసూ వర్మ నిర్మాత.మ్యూజిక్ గోపీ సుందర్

Sunday, January 19, 2020

SS. రాజమౌళి రామ్ చరణ్-ఎన్టీఆర్ ల "RRR" విడుదల తేదీ వాయిదా


దేశం లోని సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న SS. రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ RRR .ఇందులో ఇద్దరు సూపర్ స్టార్స్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లు కథనాయకులు గా నటిస్తున్న విషయం తెల్సిందే.
ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమా జులై 30, 2020 రోజున విడుదల కావాల్సి ఉంది.అయితే షూటింగ్ లో
డిలే మరియు సీ జీ వర్క్ లో డిలే వల్ల ఈ సినిమా మరో 3 నెలలు పోస్ట్ ఫోన్ అయ్యింది.ఈ సినిమా అక్టోబర్ 2020 నెల లో విడుదల కానుంది.
ఈ చిత్రంలో చరణ్ కి జోడీ గా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ చేస్తుండగా,ఎన్టీఆర్ కి జోడీ హాలీ వుడ్ నటి ఒలీవియా నటిస్తుంది.

రోహిత్ సెంచరీ ,మూడో వన్డేలో ఆస్ట్రేలియా పై భారత్ విజయం:సిరీస్ దక్కించుకున్న భారత్



ఆస్ట్రేలియా తో 3 వన్డేల సిరీస్ ను భారత్ గెలుచుకుంది.స్వదేశంలో జరిగిన ఈ సిరీస్ లో తొలి వన్డే ఆస్ట్రేలియా గెలవగా,రెండో వన్డే లో భారత్ గెలవగా,మూడో వన్డేలో కూడా భారత్ గెలిచింది.దీంతో సిరీస్ ను 2-1 తో కైవసం చేసుకుంది.
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్ల లో 286 పరుగులు చేసింది.షమీ 4 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా జట్టులో  స్టీవ్ స్మిత్(131 )సెంచరీ చేయగా ,లబుషైన్ (54) లు రాణించారు.
తర్వాత బ్యాటింగ్ కి దిగిన భారత్ ...ఓవర్ల లో లక్ష్యాన్ని ఛేదించింది.రోహిత్ శర్మ అద్భుత సెంచరీ (119 పరుగులు 128 బంతుల్లో ) చేయగా కోహ్లీ 89 (91 బంతులు) పరుగులతో రాణించాడు.
రోహిత్ ,కోహ్లీ మూడో వికెట్ కి ..పరుగులు జోడించారు.
మాన్ ఆఫ్ ద మ్యాచ్.. రోహిత్ శర్మ
మాన్ ఆఫ్ ద సిరీస్..    వి రా ట్   కోహ్లీ
స్కోర్ లు:

ఆస్ట్రేలియా286

భారత్289/3


Saturday, January 18, 2020

కేవలం 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ ను రాబట్టిన "అల వైకుంఠ పురం లో" -ఆల్ టైం రికార్డ్



స్టైలిష్ స్టార్ అల్లు  అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన "అల వైకుంఠ పురం లో " సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే 104 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇందులో తెలుగు
ఇండస్ట్రీ (AP& TS)  అన్ని సినిమాల రికార్డును బ్రేక్ చేసింది.(బాహు బలి 2  తప్ప ).రెండు తెలుగు రాష్ట్రాలలో 82 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది కూడా నాన్ బాహుబలి -2 రికార్డ్ గా చెప్పవచ్చు.సూపర్ హిట్ టాక్ తో ఈ సిన్మా దూసుకుపోతుంది.

Friday, January 17, 2020

వారం లోనే 100 కోట్ల షేర్ (దాదాపు 160 కోట్ల గ్రాస్) సాధించిన "సరి లేవు నీకెవ్వరు" బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న కలెక్షన్లు



సూపర్ స్టార్ మహేష్ బాబు ,రష్మిక మండన లు జంటగా ,అనిల్ రావి పూడి దర్శకత్వం లో ఈ సంక్రాంతి కి వచ్చిన  ' ' సరి లేరు నీకెవ్వరు ' సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుంది.కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల షేర్ ని (దాదాపు 160 కోట్ల గ్రాస్ ) సాధించి బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.ఇది సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో నే అత్యధిక వేగవంతమైన కలెక్షన్ లు మరియు బాహుబలి 2 తర్వాత అంత వేగంగా 100 కోట్ల షేర్ ను సాధంచిన మూవీ ఇదే.దీనితో చిత్ర బృందం ఫుల్ జోష్ లో ఉండి.అందుకే ఈ రోజు వరంగల్ లో విజయ యాత్ర ను plan చేశారు.

ప్రభాస్ 20 వ వ సినిమా ప్రారంభం :ఫస్ట్ లుక్ విడుదల


యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తన తర్వాతి ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది .
ఈ సినిమాకి రాధ కృష్ణ దర్శకుడు.
UV క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతుంది.
ఇది పూర్తి ఫన్ and ఎంటర్ టేయినింగ్ గా ఉండ బోతుంది.
అయితే ఇది పీరియాడిక్ లవ్ స్టోరీ మరియు యురోపియన్ బేస్డ్ మూవీ గా అనుకుంటున్నారు.
ఈ పోస్టర్ లో ప్రభాస్ తన లుక్ ని పూర్తిగా రివీల్ చేయలేదు.
ఈ ఫోటో తో ఫాన్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నరు.ఎందుకంటే ఎంతో ఖర్చుతో చేసిన "సాహో " సినిమా అనుకున్నంత హిట్ కాకపోవడం తో ఈ సినిమా పై అభిమానులు ఎన్నో అంచనాలతో ఉన్నారు.

మరో ఘనత సాధించిన "రాములో రాములా" పాట..

అల వైకుంఠ పురం లో తన హవా కొనసాగిస్తుంది. ఇప్పటికే సామజ వరగమనా పాట 1 మిలియన్ youtube like లు సాధించగా ,ఇప్పుడు అదే బాటలో రాములో రాములో సాంగ్ కూడా చేరింది.ఇది కుడా 1 మిలియన్ వ్యూస్ ని సాధించింది.ఈ ఘనత సాధించిన రెండు పాటలూ allu అర్జున్ వె కావడం అవి కూడా ఒకే సినిమా కి చెందినవి కావడం గర్వించదగిన విజయం.ఈ రికార్డులు ఇంతటితో ఆగేలా లేవు..

Thursday, January 16, 2020

ఎవరీ.... మోస్ట్ హ్యాండ్సమ్ ? ఎనీ గెస్స్..!????



వావ్ ..ఇంత గుడ్ లుకింగ్ ఉన్న ఈ హీరో ఎవరబ్బా..!అని అనుకుంటున్నారా..? తమిళ్ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో
కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "తలైవి" సినిమా లోనిది ఈ లుక్.ఈ సినిమా  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జయలలిత బయోపిక్ .ఇందులో ని స్వర్గీయ ఎంజీఆర్ పాత్రధారి లుక్ ఇది.చాలా బాగా సెట్ అయ్యాడు కదా..!ఇంతకీ ఎవరితను..తెలుసా...
..అస్సలు ఎవరూ గుర్తుపట్టలేరు..ఈ సూపర్ హ్యాండ్సమ్ హీరో ఎవరో కాదు..రోజా,బొంబాయి సినిమాలతో దేశవ్యాప్తంగా ఫేమ్ అయిన హ్యాండ్సమ్ హీరో........ అరవింద స్వామి..యెస్ తనే ఈ సినిమా కోసం ..ఎంజీఆర్ రోల్ వేస్తున్నది..చాలా బాగుంది కదూ..లుక్..


డిస్కో రాజా కోసం రవితేజ పాడిన పాట అదుర్స్


మాస్ మహరాజ్ రవితేజ హీరో గా V. I. ఆనంద్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ మూవీ 'డిస్కో రాజా'.ఈ మూవీ లో రవి తేజ ఒక పాట పాడాడు.దీనికి అదనపు ఆకర్షణ ఏంటంటే ఈ పాటని రవితేజ తో పాటు ఒకప్పటి బాలీవుడ్ లెజెండరీ సింగర్ బప్పీలహరి కూడా పాడాడు.ఇప్పుడు ఈ సాంగ్ ట్రెండింగ్ అవుతుంది..

న్యూ మైకేల్ జాక్సన్ వచ్చాడు:హృతిక్ రోషన్ నే షాక్ కి గురి చేశాడు.


ఈ వీడియో లో ఉన్న డాన్సర్ పేరు యువరాజ్ సింగ్.ఇతనొక టిక్ టాక్ వీడియో చేశాడు.ఈ వీడియో ని చూసిన @pokershash అనే ఒక ట్విట్టర్ యూజర్ ఈ వీడియో ని ట్విట్టర్ లో షేర్ చేసి ,హృతిక్ రోషన్ అండ్ ప్రభు దేవా లను టాగ్ చేశాడు.దీనికి ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించి అతన్ని మెచ్చుకోగా ,స్వయంగా హృతిక్ రోషన్ ఇతను ఎవరు?అని అడగడమే కాకుండా..ఇంత మంచి డ్యాన్స్(వాక్ ఇన్ ద ఎయిర్) తను ఎప్పుడు చూడలేదు అని ట్వీట్ చేయగా ఇప్పుడు ఇతను సెలెబ్రిటీ అయిపోయాడు.మీరు కూడా వీడియో చూడండి.


Wednesday, January 15, 2020

ఇది కదా ఫోటో అంటే: అందరు మెగా హీరోలు ప్లస్ ఒక మెగాస్టార్:ఒకే ఫ్రేమ్ లో



అభిమానుల కు కన్నుల పండగ లాంటి ఈ ఫోటో చూస్తే మెగా అభిమానులకే కాదు సినీ అభిమానులు అందరికీ ఎంతో సంతోషం కలుగుతుంది.ఈ సంక్రాంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ని ఈ తరం మెగా హీరో లు అందరూ కలిసి దిగిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతుంది.ఈ ఫోటో లో
రాం చరణ్,అల్లు అర్జున్,సాయి ధరమ్ తేజ్ ,వరుణ్ తేజ్,అల్లు శిరీష్,కళ్యాణ్ తేజ్(చిరంజీవి గారి చిన్నల్లుడు)
వైష్ణవ్ తేజ్(సాయి ధరమ్ తేజ్ తమ్ముడు-త్వరలోనే తన సినిమా రాబోతుంది)
 అండ్.......
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు 'అకీరా నందన్'..లు ఉన్నారు.నిజంగా బహుశా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బహుశా ప్రపంచ సినీ చరిత్రలో ఇంత మంది హీరోలను,దాదాపు అందరూ ఒకే జనరేషన్ లో ఉండడం ఇదే మొదటి సారి అయి ఉంటుంది.నిజంగా చిరంజీవి గారికి ఇది ప్రౌడ్ మూమెంట్..

ట్రెండింగ్ అవుతున్న మాస్ మహారాజా రవితేజ 'డిస్కోరాజా 'టీజర్


మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ ఫ్లిక్ 'డిస్కో రాజా' టీజర్ విడుదలైంది. paayal చాలా తక్కువ నిడివి ఉన్న ఈ టీజర్ లో హీరో రవితేజ మరియు విలన్ బాబీ సింహా లను సీమాత్రమే చూపించడం జరిగింది. పాయల్ రాజ్ పుత్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.
వీ ఐ ఆనంద్ దర్శకత్వం లలో వస్తున్న ఈ సినిమా ఈ నెల 24 వ తేదీన విడుదల అవబోతుంది. వాచ్ ది టీజర్


Disco Raja Movie Details : Cast : Ravi Teja, Payal Rajput, Bobby Simha, Vennela Kishore, Sathya, and others. Banner: SRT Entertainments Producer: Rajini Talluri Director: VI Anand Cinematographer: Karthik Gattamneni Music: SS Thaman Editor: Naveen Nooli

Tuesday, January 14, 2020

సింహాలతో Dean Schnider చేసిన ఈ వీడియో కి ఫిదా అవుతున్న..సోషల్ మీడియా


స్విట్జర్లాండ్ దేశానికి చెందిన వైల్డ్ లైఫ్ సంరక్షకుడుDean Schnider చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇందులో అతడి తో సింహాలు ఒక మనిషి తన కుటుంబాన్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ,కేవలం 2.5 వారాల్లో ఆ సింహాలు అలా రియాక్ట్ అయ్యాయి..ఇది చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది.వన్య ప్రాణుల సంరక్షణ  పై ప్రజలలో అవగాహన కోసం Dean Schnider ఇలాంటి వీడియోలు చేస్తాడు. ఇది దక్షిణాఫ్రికా అడవులలో చేసిన వీడియో.

నాగ చైతన్య-సాయి పల్లవి ,శేఖర్ కమ్ముల ల కొత్త చిత్రం ఫస్ట్ లుక్ సూపర్బ్


ప్రేమమ్,మజిలీ,వెంకీ మామ వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత అక్కినేని నాగ చైతన్య , "ఫిదా" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లవ్ స్టొరీ"  అనే మూవీ లో నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇందులో హీరోయిన్ మరెవరో కాదు,'ఫిదా' ఫేమ్ సాయి పల్లవి.ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ని  ఈ సంక్రాంతి సందర్బంగా విడుదల చేశారు.ఈ పోస్టర్ నిజంగా చాలా బాగుంది.శేఖర్ కమ్ముల మూవీ కావడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి.దాదాపు ఈ సినిమా మరో బ్లాక్ బస్టర్ అవడం ఖాయం.ఈ చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్ పతాకం వారు నిర్మిస్తున్నారు.

వంద కోట్ల మార్కును క్రాస్ చేసిన " సరిలేరు నీకెవ్వరూ"


సంక్రాంతి కి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా
" సరిలేరు నీకెవ్వరూ"సూపర్ హిట్ టాక్ తో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తూ ఉంది.కేవలం 3 రోజులలో 103 కోట్ల గ్రాస్ ను సాధించి..ట్రేడ్ వర్గాల్లో సంచనాలు నమోదు చేస్తుంది.ఈ చిత్ర విజయం పట్ల దర్శకుడు అనిల్ రావి పూడి ,సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర చిత్ర యూనిట్ లు వరుస ఇంటర్వ్యూ ల తో ప్రమోషన్ ని  స్పీడెక్కిస్తున్నారు.

వాట్ ఏ కిక్ బై ...లేడీ సూపర్ స్టార్ ..విజయశాంతి



తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయిక లు గా పేరు గడించిన హీరోయిన్ లలో విజయశాంతి కి ప్రత్యేక స్థానం ఉంటుంది.13 సంవత్సరాల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి కి చెందిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలలో వైరల్ అవుతుంది.దీనిని దర్శకుడు అనిల్ రావి పూడి షేర్ చేశాడు.ఇందులో విజయశాంతి జీన్స్ పాంట్ ,షర్ట్ లో ,బ్రహ్మాజీ ని కిక్ చేసే క్లిప్ అది.సూపర్బ్.. క్లిప్ వాచ్ అండ్ ఎంజాయ్..





Monday, January 13, 2020

అల్లు అర్జున్ కి విషెస్ చెబుతూ లెటర్ పంపిన పవన్ కళ్యాణ్: ఆనందం లో అభిమానులు


అల వైకుంఠ పురములో సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకు పోతుండగా..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,అల్లు అర్జున్ కి congratulations చెబుతూ ఫ్లవర్ బొకే పంపాడు.అంతే కాదు అల్లు అర్జున్ కి ఒక చిన్న విషెస్ తో కూడిన లెటర్ కూడా పంపాడు..దీనికి సోషల్ మీడియాలో అలు అర్జున్ వెంటనే వెరీ హ్యాపీ గా థాంక్స్ చెప్పాడు.దీనితో ఇప్పటి వరకు మీడియాలో వస్తున్న నెగెటివ్ రూమర్స్ కి చెక్ పడ్డట్టే..ఇది అభిమానులకు సూపర్ న్యూస్..

అల వైకుంఠపురములో - మూవీ రివ్యూ




చిత్రం పేరు : అల వైకుంఠపురములో

నిర్మాణసంస్థ :  హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌

నటీ నటులు : అల్లు అర్జున్‌, పూజ హెగ్డే,, మరియు టబు,,,, జయరామ్‌, మురళి శర్మ, సుషాంత్‌, నివేతా పేతురాజ్‌, రాజేంద్రప్రసాద్‌, సముద్రఖని, సచిన్‌ ఖేడ్‌కర్‌, రోహిణి, నవదీప్‌, హర్షవర్ధన్‌, సునీల్‌, రాహుల్‌ రామకృష్ణ, వెన్నెల కిషోర్‌, అజయ్‌, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి తదితరులు

సంగీతం: తమన్‌

DOP: PS  వినోద్

నిర్మాతలు: సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), అల్లు అరవింద్‌

రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌

విడుదల తేదీ: జనవరి 12, 2020

ఈ సంక్రాంతి కి విడుదలయిన పెద్ద సినిమాల్లో ఒకటైన “అల వైకుంఠ పురములో” నిన్న అంటే  జనవరి 12 వ తేదీన ప్రపంచ  వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది,,ప్రేక్షకులను అలరిస్తుందా లేదా అనేది ఒకసారి చూద్దాం.

కథ : ఇది పాత సినిమాలలో లాంటి కథే .కొన్ని పరిస్థితుల వల్ల , ధనవంతుల ఇళ్ళలో పెరగాల్సిన బంటు (అల్లుయ్ అర్జున్ ) ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో పెరగాల్సి రావడం,మిడిల్ క్లాస్ ఇంట్లో పెరగాల్సిన రాజ్ (సుశాంత్ )ధనవంతుడి ఇంట్లో పెరగాల్సి వస్తుంది.ఇలాంటి పరిస్థితులలో ఆ ధనవంతుడి(జయరాం) ని ఒక సారి  హీరో కల్సిన ప్పుడు ,అతడు చావు బతుకుల్లో ఉండటం ,అతన్ని హీరో అత్యద్భుతంగా రక్షించడం జరుగుతుంది.ఆ క్రమంలో అక్కడ తన  పుట్టుక  గురించి హీరో కి తెలియడం జరుగుతుంది. ఆ ధనవంతుడి ఇంటిలోని సమస్యలను హీరో ఎలా సాల్వ్ చేస్తాడు అనేది మనం తెరపై చూడాలి.(ఇంత కన్నా ఎక్కువ రివీల్ చేస్తే మూవీ పైన ఆసక్తి పోతుంది.)

విశ్లేషణ :పై కథను చూస్తే ఇది చాలా రొటీన్ కథ అనిపిస్తుంది.కానీ త్రివిక్రం అంటేనే ట్రీట్ మెంట్.ఈ సినిమా ఒక 
అద్భుతమైన ,పంచ భక్ష పరమాన్నం లాంటి ,షడ్రసోపేతమైన సినిమా అని చెప్పా వచ్చు.ఈ మూవీ లోని మొదటి 5 నిమిషాలలో కథ తెల్సిపోతుంది.ఇక అక్కడనుండి ప్రతీ నిమిషం సినిమా మనల్ని అలరిస్తూనే ఉంటుంది.ఇది అసలు 
సిసలు త్రివిక్రం సినిమా గా చెప్పవచ్చు.ఎందుకంటే అరవింద 
సమేత లో కొంత  ఫ్యాక్షన్  వైపు వెళ్ళిన త్రివిక్రం ,ఆ సినిమాలో 
 త్రివిక్రం సిగ్నేచర్ చూపించ లేకపోయాడు.(అయితే సినిమా 
సూపర్ గా ఉంటుంది ).ఇందులో మాత్రం ప్రతీ ఫ్రేం లో ప్రతీ 
డైలాగ్ లో త్రివిక్రం మార్క్ మనకి కనబడుతుంది.ఇందులో 
ఒక్కొక్కరి పనితనం చూస్తే

అల్లు అర్జున్ : అసలు స్టైలిష్ స్టార్ అని బన్నీ ని ఎందుకు పిలుస్తారో ఈ సినిమా చూస్తే మనకి అర్ధమవుతుంది.ఈ సినిమాలో దాదాపు ప్రతీ సీన్ లో బన్నీ   ఉన్నట్టు గా నే అనిపిస్తుంది.ఫుల్ ప్లెడ్జ్ డ్ యాంకర్ రోల్ గా చెప్పొచ్చు.బన్నీ తన రోల్ ని ఆటాడేసుకున్నాడు.అతడు ఎందుకు టాప్ స్టార్ అనేది ఈ సినిమా తో మరో సారి తెల్సి పోతుంది.అసలు సినిమా అభిమాని ఎవరైనా ఈ సినిమాలో బన్నీ కి ఫిదా కావాల్సిందే.అత్యద్భుతమైన ప్రదర్శన బన్నీ చేశాడు.యాక్టింగ్ అంటే ఏదో అవార్డు సినిమాలలో లాగా నటిస్తే నే కాదు,మేజర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ని అలరించడం కూడా చాలా గొప్ప విషయం.ఈ సినిమా లో బన్నీ ని చూస్తే ఒకప్పుడు చిరంజీవి,మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ఎలాంటి ఇమేజ్ ని ఎంజాయ్ చేశారో,తమ చరిష్మాతో ఎలాగైతే ప్రేక్షకులను అలరించారో అలా అనిపిస్తుంది.తన గురించి చెప్పుకుంటే ఈ సమీక్ష సరిపోదేమో .

ఇక డ్యాన్స్ విషయానికి వస్తే ప్రస్తుత జెనరేషన్ లో ఎనర్జీ అంటే తారక్, స్టైల్ అంటే అల్లు అర్జున్ అని చెప్పొచ్చు.హృతిక్ రోషన్ తర్వాత ఇండియా లో స్టైలిష్ డ్యాన్సర్ అంటే అది బన్నీ నే అని చెప్పవచ్చు అంత స్టైలిష్ గా చేశాడు.తన ఈజ్ డ్యాన్స్ తో సింపుల్ స్టెప్స్ ని కూడా ఓ లెవెల్ కి తీసుకెళ్ళాడు.బన్నీ.

 ఈ సినిమా ని బన్నీ కోసం రెండో సారి చూడాలి.

త్రివిక్రం శ్రీనివాస్
అసలు ఈ సినిమాకి సంబంధించి నిజానికి మొదట గా చెప్పుకోవాల్సింది..త్రివిక్రం గురించే అని చెప్పాలి. అతన్ని 
ఇండస్ట్రీ లో చాలా మంది గురూజీ అని పిలుస్తారు.అది ఎందుకు అన్నది మనకు తెల్సిందే.తను ఒక విజ్ఞాన భాండాగారం.ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ త్రివిక్రం నే అంటే తప్పు లేదు అనిపిస్తుంది.అంటే మిగితా వాళ్ళ రోల్ ఏమీ లేదా అంటే ఉంది,కానీ వాళ్ళందరి కన్నా త్రివిక్రమ్ రోల్ చాలా ఎక్కువ.సంభాషణ ల లో ఎన్ని అర్థాలు,ఎన్ని మంచి విషయాలు,ఎన్ని హితబోధలు అది కూడా ఎంటర్ టెయినింగ్ గా.మళ్ళీ త్రివిక్రం తాలూకు ప్రాసలు ఇందులో చూడొచ్చు.పంచ్ లు కూడా సూపర్ గా పడ్డాయి.త్రివిక్రం ప్రతీ సినిమాలో గమనిస్తే సొసైటీ ఏదో బోధిస్తూ ఉన్నట్టే ఉంటుంది.ఈ సినిమాలో మనకి స్త్రీ విలువ ఏంటి అనేది బోధించాడు.అది కూడా మనల్ని బోర్ కొట్టించకుండా.
తన గురించి ఎంత చెప్పినా తక్కువే.హీరోను ఒక వైపు క్లాస్ గా చూపిస్తూనే మళ్ళీ మాస్ గా ,హీరోయిక్ గా చూపించడం ఒక త్రివిక్రమ్ కే చెల్లింది.ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సమీక్ష సరిపోదు..సినిమా చూసి ఫీల్ కావలసిందే.
తమన్ : ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన 3 వ వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ .ఈ సినిమా తో తమన్ తన పై ఉన్న నెగెటివ్ కామెంట్స్ కి అన్నిటికీ చరమ గీతం పాడాడు అని చెప్పొచ్చు.ఒక్కొక్క పాటకు థియేటర్ లో విజిల్స్ తో ,కేరింతలతో థియేటర్ లు దద్దరిల్లుతున్నాయంటే కారణం తమన్ ఇచ్చిన మ్యూజిక్ and పాటలు.తమన్ కెరీర్ బెస్ట్ ఆల్బం గా “అల వైకుంట పురం లో” ని చెప్ప  వచ్చు.

పాటలు,వాటి పైన డ్యాన్స్ కోసం 3 వ సారి సినిమాని చూడొచ్చు.

పూజా హెగ్డే : ఈ సినిమాకి సంబంధించి చెప్పుకోవాల్సిన  4 వ వ్యక్తి పూజా హెగ్డే.తన అందంతో, గ్లామర్ తో ప్రేక్షకుడ్ని రంజింప చేస్తుంది.ఆమె గురించి చెప్పడం కన్నా తెర పై చూస్తేనే బాగుంటుంది.చాలా గ్లామరస్ గా  ఉంది.




సుశాంత్ : ఈ సినిమాలో ఏదైనా కొంచెం ఇబ్బంది పెట్టె అంశం ఏదైనా ఉందీ అంటే అది సుశాంత్ పాత్రనే అని చెప్పొచ్చు.ఈ పాత్రకు వేరే వ్యక్తిని తీసుకోవాల్సింది.అంటే సుశాంత్ బాగా చేయలేదని కాదు.ఈ పాత్రకు తను సెట్ అవ్వడు అంతే.ఒక ఎమర్జింగ్ హీరో నాగార్జున మేనల్లుడైన సుశాంత్ ఇంత తక్కువ స్కోప్ ఉన్న పాత్రను సున్నితంగా రిజెక్ట్ చేయాల్సింది.

మురళీ శర్మ : ఈ సినిమాలో తర్వాత ప్రాధాన్యం ఉన్న పాత్ర మురళీ శర్మదే.కొంచెం నెగెటివ్ టచ్ ఉన్న రోల్ ని తను చాలా బాగా చేశాడు.
సముద్ర ఖని : ఈ సినిమాలో విలన్ గా తమిళ దర్శక నటుడు సముద్ర ఖని బాగా సెట్ అయ్యాడు.అయితే ఈ పాత్ర గతంలో త్రివిక్రం విలన్ లను చూసినట్టు అక్కడక్కడా అనిపిస్తుంది.

జయరాం-టబు : గత తరం ఆందాల తార టబు ఇందులో  మాడ్రన్ తల్లి పాత్రలో సింపుల్ గా ఆర్భాటం లేకుండా నటించగా,మళయాళ వెటరన్ హీరో జయరాం  అమె భర్త పాత్రలో బాగా చేశాడు.వీళ్ళిద్దరూ పాత్రకు సరిపోయేంత నటించారు.
ఇంకా సచిన్ ఖేడ్కర్,రాజేంద్ర ప్రసాద్, నివేదా పెతురాజ్,హర్షవర్ధన్,వెన్నెల కిషోర్ , సునీల్ వంటి నటులు ఎంత చేయాలో అంతే చేశారు.ఎక్కడ కుడా ఓవర్ అనిపించదు.
ఫలితం : ఈ సినిమా ఈ సంక్రాంతి కి ఒక మంచి ఎంటర్ టెయినింగ్ సినిమా గా ఆడుతుంది.ఆల్ రెడీ  సూపర్ టాక్ , తో ఇది దూసుకు పోతుంది.ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుంది.
టాగ్ లైన్ : కనీసం ఒక్కొక్కరు  3 సార్లైనా ఈ సినిమాని చూడాలి. 

రేటింగ్: 4/5 ****

   


దుమ్ము లేపుతున్న అల వైకుంఠ పురములో :మొదటి రోజు కలెక్షన్ లు అదుర్స్..



అల్లు అర్జున్ ,పూజా హెగ్డే నాయకా నాయికలుగా ,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సంక్రాంతి కి విడుదలైన అల వైకుంఠ పురములో  సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది అని ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించింది..మంచి ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టడం తో చిత్ర యూనిట్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు..ఈ చిత్రం బహుశా రంగస్థలం రికార్డుల ను బ్రేక్ చేస్తుందని అనుకుంటున్నారు.

Sunday, January 12, 2020

సరి లేరు నీకెవ్వరూ మొదటి రోజు కలెక్షన్స్



రెండు తెలుగు రాష్ట్రాల్లో
32.77 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా
46.77 కోట్లు వసూళ్లు సాధించినట్టు ట్రేడ్ పండితులు విశ్లేషించారు.
ఇది మహేష్ బాబు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్..

వావ్ రవితేజ ...! కండలతో పిచ్చెక్కిస్తోన్న రవితేజ..



మాస్ మహారాజా రవి తేజ యొక్క ఒక ఇమేజ్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..బాగా కండలు తిరిగిన ఆర్మ్స్ తో డంబెల్ ఎక్సర్ సైజ్ చేస్తున్న రవితేజ ఫోటో చూసి..అభిమానుల ఆనందానికి అవధులు లేకపోగా..సినీ అభిమానులు షాక్ కి గురవుతున్నారు..ఇప్పటి వరకు రవితేజ ఫిట్ నెస్ కి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చేవాడు.అయితే ఇపుడు ఈ ఫోటో చూస్తే..అసలు రవితేజ నేనా..అనిపించేలా ఉంది..డిస్కో రాజా మూవీ చేస్తున్న రవితేజ. అయితే ఇది ఏ మూవీ లోనిదనే క్లారిటీ ఇంకా రాలేదు.
మీరూ ఒక లుక్ వేయండి.

Saturday, January 11, 2020

"సరి లేరు నీకెవ్వరూ"- మూవీ రివ్యూ



చిత్రం పేరు : సరి లేరు నీకెవ్వరూ
నటీనటులు: మహేష్ బాబు - రష్మిక మండన , విజయశాంతి ,ప్రకాష్ రాజ్ , రాజేంద్ర ప్రసాద్ , సంగీత ,వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హరితేజ, బండ్ల గణేష్ , అజయ్, రఘుబాబు మొ..
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాతలు: అనిల్ సుంకర - దిల్ రాజు
రచన - దర్శకత్వం: అనిల్ రావిపూడి
ఈ సారి సంక్రాంతి కి ఇద్దరు టాప్  స్టార్ ల చిత్రాలు విడుదల కానుండడం తో , సినీ అభిమానులకి నిజంగా ఈ పండగ సీజన్ ,పండగనే అని చెప్పాలి .దానిలో భాగంగానే ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “సరి లేరు నీకెవ్వరూ” మూవీ విడుదల అయింది. ఇది అభిమానుల మరియు ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా చూద్దాం.
కథ : ఇందులో కథ అంతా కర్నూల్ లో ఒక మెడికల్ కాలేజీ లో ప్రొఫెసర్ గా పనిచేసే భారతి (విజయశాంతి ) కుటుంబం చుట్టూ తిరుగుతుంది. భారతి కుటుంబాన్ని లోకల్ మంత్రి నాగేంద్ర(ప్రకాష్ రాజ్ ) తీవ్ర మైన ఇబ్బందులకు గురి చేస్తుంటూ ఉంటాడు. ఆర్మీ మేజర్ గా పని చేసే హీరో అజయ్ (మహేష్ బాబు ) ఒక ప్రత్యేక కారణం వల్ల భారతి ఇంటికి రావాల్సి వస్తుంది.కర్నూలు కి తన టీం మెంబర్ అయిన రాజేంద్ర ప్రసాద్ తో పాటు హీరో  వస్తుండగా  ట్రైన్ లో హీరొయిన్ సంస్కృతి (రష్మిక) అండ్ ఫ్యామిలీ పరిచయం కావడం జరుగుతుంది.తీరా కర్నూల్ చేరుకున్నాక భారతి పరిస్థితులు చూసి చలించి పోయిన అజయ్ వారి కుటుంబాన్ని ఎలా కాపాడాడు అనేదే కథ .
విశ్లేషణ :  శ్రీమంతుడు ,భరత్ అనే నేను,మహర్షి మూడు సినిమాలలో కొంచెం అటూ ఇటు గా మహేష్ బాబు ఒకే రకమైన , కొంచెం క్లాస్ టచ్ ఉన్న సినిమాలు చేశాడు అనే అపవాదు రావడం తో, ఈ సారి ఆ ముద్ర పోగొట్టుకోవడానికి కొంచెం మాస్ టచ్ ఉన్న రోల్ చేయాలని అనుకున్నట్లు అనిపిస్తుంది.చాలా సందర్భాలలో హీరోను మాస్ టచ్ తో చూపించడానికి ప్రయత్నం చేశాడు దర్శకుడు అనిల్ రావి పూడి.ఈ సినిమాకి సంబంధించి మెయిన్ క్యారక్టర్ ల గురించి చెప్పుకుంటే
మహేష్ బాబు : మహేష్ బాబు ఇలాంటి పాత్రలు గతం లో చేశాడు.తన పరిధిలో తన పాత్రకు న్యాయం చేశాడు.అయితే ఈ సినిమాలో కొన్ని సీన్ లలో మహేష్ బాబు సూట్ ఐనట్టు అనిపించదు.కృత్రిమంగా అనిపిస్తుంది.ముఖ్యంగా ,’మీరంతా నేను కాపాడుకుంటున్న ప్రాణాలు రా’ అనే డైలాగ్ సూట్ ఐనట్టు అనిపించదు.ప్రకాష్ రాజ్ కి లౌడ్ గా రిప్లై ఇచ్చే సీన్ కూడా ఎఫ్ఫెక్టివ్ గా లేదు.
అయితే ఈ సినిమాలో బెస్ట్ అవుట్ పుట్ ఏంటంటే మహేష్ బాబు చేసిన డ్యాన్స్.మహేష్ బాబు చిన్న తనం లో అద్భుతమైన డ్యాన్సర్ అని పేరు తెచ్చుకున్నాడు.అది మురారి ,ఒక్కడు ,అతడు ,పోకిరి లలో మాత్రమే  మనకి కనిపిస్తుంది మిగితా అన్ని సినిమాలలో డ్యాన్స్ విషయం లో మహేష్ బాబు వెనుక బడ్డాడు .నిజం చెప్పాలంటే  సేమ్ స్టెప్స్ రిపీట్ చేశాడు అండ్ బాగా సెట్ కాలేదు.అయితే ఈ సినిమా లో మాత్రం మహేష్ బాబు డ్యాన్స్ లో మ్యాజిక్ చేశాడు అనే చెప్పాలి.ముఖ్యంగా ‘డాంగ్ డాంగ్’ సాంగ్ మరియు ‘మైండ్ బ్లాక్ బ్లాక్’ సాంగ్ లో మహేష్ అద్భుతమైన డ్యాన్స్ తో మనల్ని కట్టి పడేస్తాడు.సినిమా హైలైట్స్ లలో ఇది ఒకటి.
ఇక మహేష్ కామెడీ టైమింగ్ ఎప్పటి లాగే అద్భుతంగా చేశాడు.
ఓవరాల్ గా మహేష్ ఈజ్ గ్రేట్ పెర్ఫార్మర్.అతన్ని సరిగా వాడుకోవడం దర్శకుడి ప్రతిభ పైనే ఆధార పడి ఉంటుంది.అయితే ఒక్క విషయం లో మహేష్ మాత్రం జాగ్రత్త పడాలి.అది తన లుక్ గురించి.గత 4 సినిమాలలో మహేష్ లుక్ ఒకే లాగా ఉంటుంది.దీనివల్ల ప్రేక్షకులు రొటీన్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది.కాబట్టి మహేష్ ఎట్ లీస్ట్ తన హెయిర్ స్టైల్ అయినా మార్చాలి .    
విజయశాంతి : దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందా అని అందరూ ఎంతో ఉత్సుకత తో సినిమాకి రావడం ఖాయం.అయితే ఈ సినిమాలో విజయశాంతి పాత్ర అనుకున్నంత స్కోప్ ఉన్న పాత్రేం కాదు.మరీ పవర్ ఫుల్ పాత్రేం కాదు.ఈ పాత్రను ఏ క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా చేయొచ్చు.విజయ శాంతి కి ఇంకా పవర్ ఫుల్ రోల్ ఇచ్చి ఉండాల్సింది.చాలా సీన్ లలో విజయశాంతి పాసివ్ గా ఉండాల్సి ఉంటుంది.ఈ విషయం లో అనిల్ రావి పూడి ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.ఈ సినిమా చూశాక ఈ పాత్రలో అంత స్పెషల్ ఏముందని విజయశాంతి ఒప్పుకుంది అని అనిపిస్తుంది.
ఇక ఎంతో అనుభవం ఉన్న నటి కాబట్టి విజయ శాంతి ఈజీ గానే తన పాత్రను పోషించింది .
రష్మిక మండన : ఈ సినిమాలో బాగా అలరించిన పాత్ర రష్మిక అనే చెప్పాలి.ఫుల్ లెంత్ కామెడీ రోల్ ఐనప్పటికీ పాటల్లో తన అందం తో ఆకట్టుకుంటుంది.రష్మిక ఈ సినిమాలో ఫుల్ మార్కులు కొట్టేసింది.ముఖ్యంగా “మీకు అర్దమవుతుందా?” “అయాం ఇంప్రెస్డ్” అనే డైలాగ్ ఫేమస్ అవుతుంది. ఈ సినిమాతో రష్మిక టాప్ లీగ్ లోకి వెళ్లి పోయింది.
ప్రకాష్ రాజ్ : ఇందులో సీరియస్ విలన్ గా అనుకుని వెళ్తే ,అది కాస్త కామెడీ విలన్ రోల్ .యధావిధిగా ప్రకాష్ రాజ్ ఈజీ గా చేసేశాడు.కొన్ని సార్లు ‘ఒక్కడు’ సినిమాలో ని ఓబుల్ రెడ్డి పాత్రకి కొనసాగింపు అనిపిస్తుంది కానీ ఆ రేంజ్ కాదు. ఇలాంటి పాత్రలు ప్రకాష్ రాజ్  తన కెరీర్ లో ఎన్నో చేశాడు.
రాజేంద్ర ప్రసాద్ : స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హీరో తో పాటు ఉన్న పాత్ర రాజేంద్ర ప్రసాద్ (ప్రసాద్) పాత్ర .అయితే ఇందులో, కామెడీ పాత్రనే ఐనప్పటికీ.. ఒక్క ట్రైన్ ఎపిసోడ్ లో మాత్రమే తన  కామెడీ పండింది.మిగితా సీన్ లు మామూలుగా ఉన్నాయి.
సంగీత –రావు రమేష్ : హీరొయిన్ సంగీత ఈ సినిమాలో రావు రమేష్ భార్యగా నటించింది.తనకి మంచి పాత్ర లభించింది.కామెడీ ని బాగా చేసింది.రావు రమేష్ కూడా ట్రైన్ ఎపీసోడ్ లో బాగా చేశాడు.
తమన్నా : ఈ సినిమలో హైలైట్స్ లలో తమన్నా డ్యాన్స్ ఇరగ దీసింది.సౌత్ లో డ్యాన్స్ లో టాప్ అంటే తమన్నా నే అనేలా చేసింది.సూపర్.
ఇంకా ,జయప్రకాష్ రెడ్డి,బండ్ల గణేష్, సుబ్బరాజు  లు కొంత వరకు పరవా లేదు అనిపించారు.
సంగీతం : దేవిశ్రీ ఈ సినిమాకి మంచి పాటలను ఇచ్చాడు.ఆహా,ఓహో అనలేం కానీ , డాంగ్ డాంగ్ , అబ్బబ్బ , మైండ్ బ్లాక్ సాంగ్ లు బాగున్నాయి.అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్.
కెమెరా :  రత్నవేలు కెమెరా పనితనం జస్ట్ ఒకే .
దర్శకత్వం : కామెడీ లో తనకి తిరుగు లేదని అనిల్ రావి పూడి మరో సారి ప్రూవ్ చేసుకున్నాడు.సినిమా మొత్తాన్ని ఒక రేంజ్ కి తీసుకెళ్ళే ఎపీసోడ్ ట్రైన్ ఎపిసోడ్.ఎవ్వరైనా ఈ ట్రాక్ మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారు.అంత బాగుంది.తన గత చిత్రాలలాగే ఈ సినిమాలో కూడా కొన్ని ప్రత్యేకమైన డైలాగ్ లు నటీ నటులతో అనిపించాడు.’నెవ్వర్ బిఫోర్ ,నెవర్ ఆఫ్టర్’, ’నీకు అర్దమవుతుందా’, ‘అయాం ఇంప్రెస్డ్’ ‘టేక్ ఏ బౌ’ వంటి పదాలు బాగా జనాల్లోకి చొచ్చుకుపొతాయి.చాలా సందర్భాలలో ప్రేక్షకులను దర్శకుడు నవ్విస్తాడు..సీరియస్ మూవీ అనుకున్న ఈ సినిమాను క్లైమాక్స్ ని కూడా కామెడీ ట్రాక్ తో ఎండ్ చేశాడు.
అయితే హీరోఇజాన్ని ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు.కొన్ని సార్లు తన గత చిత్రాల చాయలు మనకి కనిపిస్తాయి.కానీ ఓవరాల్ గా డైరెక్టర్ గా పాస్ అయ్యాడు.
హైలెట్స్ : ట్రైన్ ఎపిసోడ్,కామెడీ ,సాంగ్స్
మైనస్ : ఈ సినిమా లో రెండు వేరే వేరే కథలను అతికించినట్టు అనిపిస్తుంది.గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం.మహేష్ బాబుని ,విజయశాంతి ని సరిగా వాడకపోవడం.
కష్టాల్లో ఉన్న ఒక కుటుంబాన్ని హీరో ఆదుకోవడం అనే కాన్సెప్ట్ సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇలాంటి కథకి  ట్రీట్ మెంట్  ఇంకా బాగుండాల్సింది.
ఫలితం: ఈ సంక్రాంతికి కుటుంబం అందరూ చూడ దగ్గ సినిమా అవుతుంది.అయితే గత రికార్డులను బ్రేక్ చేయలేదు. కానీ హిట్ గ్యారెంటీ .ఇంకా బాగా తీసి ఉండాల్సింది.
రేటింగ్ : 3/5   ***