Rajiv Gandhi International Stadium uppal, Hyderabad:
ఇక్కడి రాజీవ్ గాంధి స్టేడియం లో నిన్న జరిగిన మొదటి వన్డేలో భారత్ ఆస్ట్రేలియా పై నెగ్గింది.ఇటీవల జరిగిన టీ20 సిరీ స్ లో రెండింటికీ రెండూ ఓడి పోగా వన్డే లో చాంపియన్ లైన టీమిండియా ఆస్త్రేలియ తో 5 వన్డేల సిరీస్ లో బోణీ చేసింది .టాస్ గెలిచ ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ,బౌలర్లు విజృంభించడం తో ఆస్ట్రేలియా 50 ఓవర్ ల లో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది .ఆస్త్రేలియన్ బ్యాట్స్ మన్ లలో ఉస్మాన్ ఖ్వాజా 50 పరుగులు (76 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ ) ,మాక్ష్ వెల్( 40) ,స్టాయినిస్( 37) రాణించారు.భారత బౌలర్లలో భుమ్రా ,షమీ ,కుల్దీప్ యాదవ్ లు తలా 2 వికెట్లు పడగొట్టారు.కేదార్ జాదవ్ ఒక వికెట్ తీసుకున్నాడు.
తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ,ఓపెనర్ శిఖర్ ధావన్ డక్ అవుట్ ఐనపటికీ కెప్టెన్ కోహ్లీ (44),రోహిత్ 37 ,పరుగుల తో రాణించి అవుట్ కాగా ,మ్యాచ్ చేజారుతున్న సమయంలో ధోనీ,59 నాటౌట్ (72 బంతుల్లో 6 ఫోర్లు , 1 సిక్స్) కేదార్ జాదవ్ 81( 87 బంతుల్లో 9 ఫోర్లు 1 సిక్స్ ) నాటౌట్ లు పరిస్థితి ని చక్క దిద్ది భారత్ కు విజయాన్ని అందించారు.






















