సౌతాంఫ్టన్: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీ చేయడం తో దక్షిణాఫ్రికా తో జరిగిన ప్రపంచ కప్
మొదటి లీగ్ మాచ్ లో భారత్ శుభారంభం చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్ల ప్రతిభ తో 9 వికెట్ల నష్టానికి కేవలం 227 పరుగులు చేయ గలిగింది.భారత్ బౌలర్ల లో యజువేంద్ర చాహల్ అద్భుతమైన బౌలింగ్ తో 4 వికెట్లు పడగొట్టగా,భుమ్రా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ లను కట్టడి చేశాడు.మిగితా బౌలర్లు కూడా సహకారాన్ని అందించారు. నిజానికి దక్షిణాఫ్రికా ఇంకా తక్కువ స్కోరుకే ఆలౌట్ కావాల్సింది.కానీ టైలెండర్లు పోరాడటం తో ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్ శిఖర్ ధావన్ (8)వికెట్ ను తొందరగానే కోల్పోయినా, కే ఎల్ రాహుల్ ,కోహ్లీ , ధోనీ ల సహాయంతో రోహిత్ శర్మ భారత్ ను గెలిపించాడు. అతడు 144 బంతుల్లో 122 పరుగుల(13 ఫోర్లు,3 సిక్స్ లు) తో నాటౌట్ గా నిలిచాడు. భారత్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
స్కోర్లు:
దక్షిణాఫ్రికా బ్యాటింగ్:
భారత్ బౌలింగ్:
భారత్ బ్యాటింగ్:
Visit for more updates
www.thribhuavanavijayam.com













