వంశీ పైడి పల్లి దర్శకత్వంలో, మూడు దిగ్గజ సంస్థలు నిర్మించిన,
సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ చిత్రం "మహర్షి"ప్రపంచ వ్యాప్తంగా 294 కోట్లను వసూల్ చేసినట్టు ఇండియా టుడే ధృవీకరించింది.దాదాపు 154.4 కోట్ల షేర్ తో దూసుకు పోతుంది.నిజానికి క్రిటిక్స్ ఈ సినిమాకి కొంత నెగెటివ్ రాయడం,మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం కొనసాగిస్తోంది.సమ్మర్ హాలిడేస్ ని పూర్తి స్థాయిలో ఎన్ కాష్ చేసుకుంటుంది ఈ మూవీ..ఇందులోని రైతుల సమస్యల ఎపిసోడ్ సినిమాకి బాగా ప్లస్ అయింది.దీని వల్ల మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి సినిమా కి రిపీటెడ్ ఆడియన్స్ వస్తున్నారు.భారత్ అనే నేను లైఫ్ టైం వసూళ్లను(232.4 కోట్లను) కేవలం వారం రోజుల్లో ఈ సినిమా క్రాస్ చేయడం విశేషం.దాదాపు ఈ సినిమా మొదటి వారానికి సంబంధించి, నాన్ బాహుబలి రికార్డులను అన్నింటిని క్రాస్ చేసింది. ఇది మహేష్ కెరీర్ లొనే అల్ టైం టాప్ గ్రాసర్.
ఇక 'రంగ స్థలం' లైఫ్ టైం రికార్డులను ఇది క్రాస్ చేస్తుందని అందరూ అనుకుంటున్నారు.










