సూపర్ స్టార్ మహేష్ బాబు "మహర్షి" సినిమాకి అనుకోని విధంగా గొప్ప ప్రశంశ లభించింది.మనదేశ ఉప రాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు gaaru ,ఈ సినిమాను చూసి
"కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు "మహర్షి " చిత్రాన్ని చూడడం జరిగింది.గ్రామీణ ఇతివృత్తం తో ,వ్యవసాయ పరిరక్షణను ,అన్నదాత ల కు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియ జేసినా ప్రభోదాత్మక చిత్రం .ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా "
అని ట్వీట్ చేశారు.
దీనికి సూపర్ స్టార్ మహేష్ బాబు స్పందిస్తూ
"సార్ ఇది నాకు వ్యక్తిగతంగా మరియు ఈ చిత్ర టీం అందరికీ ఎంతో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను.ఇంత కన్నా ఆనందం ఇంకేం ఉండదు.కృతజ్ఞతలు సర్,మీ మాటలు మాకు "మహర్షి " లాంటి మరిన్ని మంచి చిత్రాలు తీయడానికి ప్రేరణ కలిగించింది .ఎంతో వినయ పూర్వకంగా మా టీమ్ తరుపున మీ కు కృతజ్ఞతలు"
అని రిప్లై ఇచ్చాడు.



0 comments:
Post a Comment