తమిళస్టార్ హీరో ‘తల’ అజిత్ మరియు లేడీ సూపర్ స్టార్ నయనతార
నటించిన 'విశ్వాసం' చిత్రం సంక్రాంతికి
ప్రేక్షకులముందు కు రాబోతోంది. ఈసినిమా ఫై ముందునుండి
అజిత్ అభిమానుల్లో వున్నఅంచనాలను సినిమా ట్రైలర్ ఒక్కసారిగా తారస్థాయికి తీసుకెళ్లింది. ఇందుకు ముఖ్య కారణం ఇంతకు ముందెన్నడూ కనిపించనంత మాస్ లుక్
లో అజిత్ కనిపిస్తూ ఉండటం మరియు ట్రైలర్ పల్లెటూరి
నేపధ్యంలోఉండటం.
తమిళనాడులోఅజిత్ కి అధికంగా మహిళా అభిమానులు ఉండటం వలన వారి కోసం తమిళనాడులో
ని తిరునిరవూర్ తి
తిరువల్లూర్ జిల్లాల్లో ముందస్తు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వీలుగా వారికి స్పెషల్
షోలు వేయడానికి ప్లాన్ చేసారు. ఇప్పటికే మొదలైన అడ్వాన్స్
బుకింగ్, థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తుంది తమిళనాడులోనే 1000 కి పైగా థియేటర్స్ లో విడుదల అవుతుండటం మరియు తమిళనాడు ప్రభుత్వం
మొదటి 10 రోజులు ప్రతిరోజు 5 షోలకు అనుమతించడంవలన
అజిత్ సరికొత్త రికార్డులు నిలపటం ఖాయంగా కనిపిస్తుంధి.



0 comments:
Post a Comment