ఆస్ట్రేలియా టూర్ లో ,3 వన్డేల సిరీస్ లో భాగంగా భారత జట్టు సిడ్నీ లో జరిగిన , మొదటి వన్డే లో ఓటమి పాలైంది.మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 288/ 5 పరుగులు చేయగా ,భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల కు 254 పరుగులు మాత్రమే చేయగల్గింది.ఆస్ట్రేలియా తరుపున ఖ్వాజా 59,షాన్ మార్ష్ 54,హాండ్స్ కూంబ్ 73, స్టాయినిస్ 47 నాటౌట్ పరుగుల తో రాణించారు.భారత్ బౌలర్లు ప్రారంభంలో కట్టడి చేసినా తర్వాత్ డాన్ని కొనసాగించలేకపోయారు.భువీ 2, కుల్దీప్ 2 , జడేజా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.భారత్ బ్యాటింగ్ లో రోహిత్ శర్మ సూపర్ సెంచరీ (129 బంతుల్లో 133. 10 ఫోర్లు, 6 సిక్స్ లు ) భారత్ ను ఓటమి నుండి రక్షించ లేకపోయింది.ధోనీ 51 (96 బంతుల్లో 3 ఫోర్లు ,ఒక సిక్స్ ) పరుగులు చేసినా ఎక్కువ బంతులు వృధా చేసి వెనుదిరిగాడు.మిగితా వికెట్లు త్వర త్వరగా కోల్పోవడం వల్ల కావాల్సిన రన్ రేట్ ను భారత సాధించలేక పోయింది.ఆస్ట్రేలియా బౌలర్ల లో జే రిచర్డ్సన్ 4 వికెట్లు తీసి భారత్ ను దెబ్బ తీసాడు.అతనికే 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ' అవార్డ్ లభించింది.
భారత్ తరుపున 2 మైలు రాళ్ళు
ఈ మ్యాచ్ లో ధోనీ 10 వేల పరుగులు సాధించాడు.అంతే కాకుండా ఈ ఫీట్ సాధించిన 13 వ ఆటగాడు.
ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ 100 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు.ఈ ఫీట్ సాధించిన వారిలో భారత్ తరుపున 19 వ ఆటగాడు.
రోహిత్ శ్రమ వృధా
భారత్ తరుపున 2 మైలు రాళ్ళు
ఈ మ్యాచ్ లో ధోనీ 10 వేల పరుగులు సాధించాడు.అంతే కాకుండా ఈ ఫీట్ సాధించిన 13 వ ఆటగాడు.
ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ 100 వికెట్ల మైలు రాయిని చేరుకున్నాడు.ఈ ఫీట్ సాధించిన వారిలో భారత్ తరుపున 19 వ ఆటగాడు.



0 comments:
Post a Comment