By R.. at January 24, 2019
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) విజయ పరంపర కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుండి జనవరి 24, రాత్రి 11 గంటల 37 నిమిషాలకు PSLV C-44 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 26 గంటల నిరీక్షణ తరువాత భారత రక్షణ రంగానికి చెందిన మైక్రోశాట్-ఆర్ మరియు తమిళనాడు హైస్కూల్ విద్యార్థులు రూపకల్పన చేసిన కలాం శాట్‌ను నిర్ణీత కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టబడ్డాయి. అనంతరం ఇస్రో చైర్మన్ డా. కే. శివన్ PSLV C-44 మిషన్ లో పాల్గొన్న టీమ్ కు మరియు కలామ్ శాట్ ని రూపొందించిన హై స్కూల్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
0 comments:
Post a Comment