న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. 90 పరుగుల తేడాతో
న్యూజీలాండ్ ను ఓడించింది. 325 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ బ్యాట్స్ మెన్
విఫలమయ్యారు. 234 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ మరోసారి
సత్తా చాటి, 4 వికెట్లతో కివీస్ బ్యాట్స్ మెన్ ను ఇబ్బంది పెట్టాడు.

మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు
సాధించింది. రోహిత్ శర్మ 87, ధావన్ 66, కోహ్లీ 43, అంబటి రాయుడు 47, ధోనీ 48, జాధవ్
22 పరుగులు చేశారు.కివీస్ బౌలర్లలో బౌల్ట్, ఫెర్గ్యూసన్ లు చెరో 2 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ కి దిగిన కివీస్... క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. బ్రేస్ వెల్ ఒక్కడే
భారత్ ను కొంత వరకు ఎదుర్కోగలిగాడు. మిగిలిన బ్యాట్స్ మెన్లలో మన్రో 31, టేలర్ 22, లాథమ్ 34,
నికోల్స్ 28 పరవా లేదనిపించారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 4, భువేశ్వర్ కుమార్ 2, చాహల్ 2 వికెట్లు తీయగా... షమీ, జాధవ్ లో
చెరో వికెట్ పడగొట్టారు. రోహిత్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది

0 comments:
Post a Comment