ఎమ్మెస్ ధోనీ ప్రపంచ cricket లో పరిచయం అక్కర్లేని పేరు. భారత
కెప్టెన్ లలో అతడు సాధించిన విజయాలు మరెవరూ సాధించ
లేదు.అంతే కాదు 3 ICC ప్రపంచ టోర్నీ లు(వన్డే
వరల్డ్ కప్ ,టీ 20 వరల్డ్ కప్ మరియు ICC నాక్ అవుట్ టోర్నీ ) నెగ్గిన ఏకైక
కెప్టెన్ ధోనీ ఎంతటి ఒత్తిడిలోనైనా కూల్ గా ఉండడం ధోనీ కే సాధ్యం .అంతే కాదు
మైదానం బయట కూడా ధోనీ చాలా సింపుల్ గా ఉండే విధానం అతనికి ఎంతో మంది ఫ్యాన్స్
అయ్యేలా చేసింది.ఇప్పుడు ఐపీఎల్ లో కూడా నిన్న ఒక మ్యాచ్ సందర్భంగా ఒక 60 ఏళ్ల
పెద్దావిడ ,చేతి లో ఒక ప్లకార్డు పట్టుకుని ,దానిపై నేను కేవలం ధోనీ కోసం వచ్చాను
అని రాసి ,ప్రదర్శించింది.దీనిని లైవ్ లో అందరూ చూశారు.అయితే ఇది చూసిన ధోనీ
మ్యాచ్ అనంతరం ఆమెను కలిసి ఆమెతో ఫోటో దిగి ఆమెను ఎంతో సంతోషపెట్టాడు.ఆమె అతన్ని ఎంతో
ఆప్యాయంగా ఆశీర్వదించింది.ఇప్పుడు ఈ వీడియో నెట్ లో వైరల్ అవడమే కాదు,ధోనీ పై ఉన్న
గౌరవాన్ని మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=hzcqu3tdB60
https://www.youtube.com/watch?v=hzcqu3tdB60



0 comments:
Post a Comment