"యాత్ర" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్: ముఖ్య అతిథిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి???
ఒక్కడిగా మొదలై, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన ప్రభంజనమ్ తో కాంగ్రెస్ పార్టీ ని అధికారం లోకి తెచ్చిన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టమైన పాదయాత్ర ప్రధానంగా తెరకెక్కిన "యాత్ర" మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ రేపు ఫిబ్రవరి 1 వ తేదిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి వై.ఎస్.ఆర్. తనయుడు ఆంధ్రప్రదేశ్ ప్రతి పక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథి గా హాజరు కాబోతున్నట్టు ముందునుండి సినిమా టీం చెప్తూ వస్తుంది. కానీ ఇంకా జగన్ నుండి అధికారిక ప్రకటన వెలువడ లేదు. మలయాళ అగ్ర కథానాయకుడు వై.ఎస్.ఆర్ పాత్రలో ట్రైలర్ లో కనిపించిన తీరు ఇటీవల రీలీజ్ అయినా పాటలకు వస్తున్న స్పందన బాగుంది. ఇక జగన్ ప్రీ రీలీజ్ ఈవెంట్ కి వస్తే ఫిబ్రవరి 8 న రిలీజ్ కాబోతున్న సినిమాకు ఇంకాస్త ఊపు వస్తుంది అనటంలో సందేహం లేదు.




0 comments:
Post a Comment