"తిప్పరా మీసం" అంటున్న శ్రీ విష్ణు.
పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ, చాల సహజంగా నటిస్తు, తాను చేసే ప్రతి సినిమాలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్న యువ హీరో శ్రీ విష్ణు హీరో గా తెరకెక్కుతున్న తిప్పరా మీసం సినిమా ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితం రిలీజ్ చేసారు. ఫస్ట్ లుక్ లో శ్రీ విష్ణు చాల మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. టైటిల్ కి తగ్గట్టు గుబురు గడ్డం, పెద్ద మీసం కట్టు తో, పగిలిన కళ్లజోడుతో షర్ట్ లేకుండా ఉన్న శ్రీ విష్ణు లుక్ ని కొత్తగా డిజైన్ చేసారు. ఈ సినిమాకు కృష్ణ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.




0 comments:
Post a Comment