"ఎన్టీఆర్ కథా నాయకుడు" సినిమా తర్వాత దాని రెండవ భాగం " ఎన్టీఆర్ -మహా నాయకుడు " ఈ నెల 22 న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా ఈ చిత్ర యూనిట్ ఒక ట్రైలర్ ని విడుదల చేసింది.ట్రైలర్ అంతా ఎమోషనల్ గా సాగింది. ఇందులో నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్ ప్రధానంగా సాగుతుంది అనే విషయం అర్ధమవుతుంది. స్వర్గీయ ఇందిరా గాంధీ పాత్రను కూడా ఇందులో చూపించారు.మొదటి భాగం కన్నా రెండవ భాగం లో హరి కృష్ణ , చంద్ర బాబు ల పాత్రల నిడివి ఎక్కువ గా ఉండ బోతున్నాయి. కీరా వాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది . బాల కృష్ణ పూర్తిగా ఎన్టీఆర్ లాగా మారినట్టు ఉంది. మొత్తంగా ట్రైలర్ పాజిటివ్ గా అనిపిస్తుంది.
Saturday, February 16, 2019
ఎన్టీఆర్ మహా నాయకుడు ట్రైలర్ విడుదల : ఆసక్తికరంగా సాగిన ట్రైలర్
By . at February 16, 2019
No comments



0 comments:
Post a Comment