ఎంతో మంది ఆశావహులు ఎదురు చూస్తున్న తెలంగాణా మంత్రి వర్గ విస్తరణ ఈ నెల 16 న జరగనుందని సమాచారం.తెలంగాణా రాష్ట్రం లో అసెంబ్లీ ఎలక్షన్ లలో ఘన విజయం సాధించిన తెరాస పార్టీ , అధినేత కెసిఆర్ ను ముఖ్యమంత్రి గా ఎన్నుకున్న విషయం తెలిసిందే.అయినా చాలా రోజులనుండి మంత్రి వర్గ విస్తరణ జరగక పోయే సరికి ఆశావహుల్లో ఎంతో ఉత్కంఠ కల్గింది.ఈ నెల 16 న కేబినెట్ విస్తరణ జరుగుతుండటం తో ఇక అందరూ రిలాక్స్ అవ్వొచ్చు.ఇప్పటి వరకు అయితే 8 మంది ఎమ్మెల్యే ల కు మాత్రమే మంత్రి పదవి దక్కనున్నట్టు తెలుస్తుంది.
హరీష్ రావు కి మంత్రి పదవి ఖాయం :
ఇప్పటి వరకు చక్కర్లు కొడుతున్న పుకార్ల ప్రకారం ..హరీష్ రావు ను MP గా పోటీ చేయిస్తున్నారు కాబట్టి మంత్రి రాదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ వార్తలను బట్టి ,హరీష్ రావు కి మంత్రి పదవి ఖాయం అని తెలుస్తుంది.దీంతో ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లు ఐంది.హరీష్ రావు తో పాటు ఈటెల రాజేందర్,జగదీశ్వర్ రెడ్డి ,తలసాని లకు మంత్రి పదవి ఖాయం, అని అంటున్నారు.కాగా,మిగతా 5 గురు ఎవరో 16 వ తేదీన తెలుస్తుంది.




0 comments:
Post a Comment