నేచురల్ స్టార్ నాని నటించిన కొత్త చిత్రం "జెర్సీ".ఈ సినిమా ట్రైలర్ నిన్న విడుదలైంది.నిజంగా ట్రైలర్ అద్భుతంగా ఉంది.ట్రైలర్ ప్రకారం సినిమా లో 10 సంవత్సరాల క్రితం నాని ఒక ఆవేశం కలగలిపిన క్రికెట్ ప్లేయర్.అతడు మైదానం లో దూకుడుగా ఉండే వాడని తెలుస్తుంది.అలాంటి హీరో అర్జున్(నాని) జీవితం లోకి హీరోయిన్ ఎంటర్ కావడం ,హీరో ఆవేశం వల్ల క్రికెట్ లో ఎదగలేకపోవడం ,ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని,ఒక సాధారణ గ్రేడ్ 3 అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూ, ఒక 5 ఏళ్ల కొడుకు కు తండ్రిగా ,జీవితం లో ఓడిపోయి,భార్య దృష్టి లో చిన్న చూపు చూడబడే ఒక యువకుడు తిరిగి తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనేదే కథ లాగా ట్రైలర్ ని బట్టి తెలుస్తుంది.అయితే నానీ ఈ ట్రైలర్ లొనే అద్భుతమైన ,హావ భావాలను పండించాడు.నిజంగా నాచురల్ స్టార్ అనిపించుకున్నాడు.హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ బాగుంది.బహుశా ఈమె సినిమాలో కోచ్ సత్యరాజ్ కూతురు అయి ఉంటుంది. ఈ సినిమా తో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మంచి డైరెక్టర్ గా మొదటి సినిమా తో నే పేరుతెచ్చుకోవడం ఖాయం.ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై , సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.PDV ప్రసాద్ సమర్పిస్తు న్నాడు.ఈ సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం.ఇది ఈ నెల 19.న విడుదల అవుతుంది.
ట్రైలర్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
కామెంట్: cant wait to watch..
మరిన్ని సినిమా అప్డేట్స్ కొరకు విజిట్ చేయండి
www.thribhuvanavijayam.com






0 comments:
Post a Comment