శివ నిర్వాణ దర్శకుడిగా ,నాగ చైతన్య సమంతా హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన " మజిలీ " కలెక్షన్ ల వర్షం కురిపిస్తుంది.ఇది నాగ చైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ వసూళ్లు చేసిన చిత్రం. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రమ్ కేవలం 5 రోజుల లోనే 21 కోట్ల షేర్ ను సాధించడం జరిగింది. పూర్తి గా ఫామిలీ ఓరియెంటెడ్ గా ఉండడం, కథ కథనాలు దర్శకుడు నడిపిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్ర విజయం పై అక్కినేని నాగార్జున చాలా ఆనందాన్ని వ్యక్తం చేశాడు చైతన్య ,సమంతాలను ఎంతో మెచ్చుకున్నాడు. ఈ చిత్ర విజయం తో వరుస గా రెండు హిట్స్ సాధించిన డైరెక్టర్ గా శివ నిర్వాణ కు మంచి పేరు వచ్చింది. మొదటి సినిమా "నిన్ను కోరి " హిట్ అయ్యింది . ఇప్పుడు మజిలీ సూపర్ హిట్ అవడమే కాకుండా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతుంది.
ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ అయినట్టు తె౩లుస్తుంది.ఇక నుండి వచ్చేవి అన్నీ లాభాలే. ఈ సినిమా ఈ సంవత్సరం లో F2 తర్వాత రెండవ హిట్ఎ.లక్షన్ ల హడావుడి రేపటితో పూర్తి కానుండడం తో కలెక్షన్ లు ఇంకా పెరుగుతాయని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
visit every day for movie updates
www.thribhuvanavijayam.com




0 comments:
Post a Comment