ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారం లో చాలా బిజీ గా ప్రచారం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య తీరిక వేళల్లో బస చేయడానికి టైం లేక ఎక్కడ వీలైతే అక్కడ ఆగి భోజనం చేయడం చూస్తున్నాం.ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక ప్రాంతం లో నేల పై ఒక చిన్న చాప మీద కూర్చుని ఒక మట్టి పాత్ర లో భోజనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఫాన్స్ తమ హీరో సింప్లిసిటీ కి జోహార్లు చెబుతున్నారు.సామాన్య ప్రజలు కూడా ఈ ఫోటోలను ఆసక్తి గా చూస్తున్నారు.
కృష్ణా జిల్లా ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ,మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి లైట్ హౌస్ వద్ద కాసేపు సేదతీరి, ఆహారం తీసుకున్నారు. మట్టిగిన్నెలో జొన్నఅన్నం మజ్జిగలో కలుపుకొని పచ్చిమిరపకాయ పచ్చడితో నంజుకొని తిన్నారు.
వేపచెట్టు కింద కూర్చొవడానికి తాటాకు చాపల కార్య కర్త లు ఏర్పాటు చేశారు. ఆ వాతావరణం ఎంతో ఆహ్లాదం కలిగించడంతో జనసేనాని కాసేపు తాటాకు చాపలపైనే సేదతీరారు.
0 comments:
Post a Comment