ఇట్స్ అఫీషియల్ ...మొన్నటి
వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్ లు సాధించిన చిత్రం ఏది అంటే జేమ్స్
క్యామెరాన్ విజువల్ వండర్ “అవతార్ “ అని
చెప్పే వాళ్ళం, కానీ ఇప్పుడు ఆ రికార్డును మార్వెల్ మాగ్నం ఓపస్ “అవెంజర్స్ ఎండ్
గేమ్” బద్దలు కొట్టింది.”అవతార్ “ గతం లో 2.778 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు
చేయగా , “అవెంజర్స్ ఎండ్ గేమ్” 2.789 బిలియన్ అమెరికన్ డాలర్లు వసూలు చేసి ఆ
రికార్డును బద్దలు కొట్టింది.గత 22 ఏళ్ళు గా జేమ్స్ కామెరూన్ సినిమాలు రెండు అగ్ర
స్థానం లో ఉండగా (మొదట టైటానిక్ తర్వాత అవతార్) ఇప్పుడు ఆ రికార్డును “అవెంజర్స్
ఎండ్ గేమ్” అధిగమిచింది .అయితే డైరెక్ట్ రిలీజ్ లో ఇది సాధ్యం కాలేదు,అందుకే “అవెంజర్స్
ఎండ్ గేమ్” లో రెండు పోస్ట్ క్రెడిట్ సీన్ లు ఆడ్ చేసి మళ్ళీ విడుదల చేయడం తో ఇది
సాధ్యమయ్యింది.



0 comments:
Post a Comment