2019 జూన్ నెల నుండి ఇంగ్లాండ్ లో జరుగబోయే వన్డే క్రికెట్ ప్రపంచ కప్ కు టీమిండియా కు ప్రాతినిధ్యం వహించ బోయే 15 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ఈ రోజు ముంబై లో ప్రకటించింది .
చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ సారధ్యం లోని సెలెక్టర్లు ఈ జట్టును ఎంపిక చేశారు.అందరూ ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ సారధ్యం లో టీమిండియా లోని ముఖ్యమైన సీనియర్ ఆటగాళ్ళు ,MS ధోనీ ,శిఖర్ ధావన్ ,రోహిత్ శర్మ మరియు యువ కే ఎల్ రాహుల్ లు జట్టులో చోటు సంపాదించగా ,రవీంద్ర జడేజా ఇంగ్లాండ్ లో ని డ్రై పిచ్ లలో ఉపయోగ పడవచ్చు అని సెలక్ట్ చేసినట్టు ప్రసాద్ తెలిపాడు.అదే విధంగా రిశభ్ పంత్ ,కు బదులు సీనియర్ మరియు మెరుగైన కీపర్ దినేష్ కార్తిక్ ను ఎంపిక చేసినట్టు తెలిపాడు.ఐపీఎల్ ప్రదర్శన ను పరిగణ లోకి తీసుకోలేదని చెప్పాడు. ఆల్ రౌండర్క గా హార్దిక్ పాండ్యా కు తోడుగా విజయ్ శంకర్ ను ఆల్ రౌండర్ గా తీసుకున్నారు.ఇతడు మీడియం ఫేసర్ మరియు బ్యాట్స్ మెన్ మంచి ఫీల్డర్ కావడం తో ఆమటి రాయుడును పక్కన పెట్టారు. బౌలర్లు భుమ్రా,భువనేశ్వర్ ,షమీ ల త్రయానికి తోడు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్,యజువేంద్ర చాహల్ మరియు కేదార్ జాదవ్ లను ఎంపిక చేశారు.అవసరమైతే కేదార్ జాదవ్ బ్యాట్ తోనూ రాణించ గలడు కాబట్టి అతను కూడా ఒక ఆల్ రౌండరే.ప్రస్తుతం మనకున్న ఆటగాళ్ళలో ఇదే అత్యంత సమతుల్యమైన జట్టు అని MSK ప్రసాద్ తెలిపాడు. ఈ కార్యక్రమం లో బీసీసీఐ అధ్యక్షుడు అమితాబ్ చౌదరి కూడా పాల్గొన్నాడు. వీరితో పాటు ఖలీల్ అహ్మద్ మరియు నవదీప్ సైనీ ల ప్రస్తావన కూడా వచ్చిందని రిజర్వ్ ఆటగాళ్ళ జాబితాలో వీరి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు ప్రసాద్ తెలిపాడు.
- Virat Kohli (C),
- Rohit Sharma,
- Shikhar Dhawan,
- MS Dhoni(WC),
- KL Rahul,
- Ravindra Jadeja
- Vijay Shankar,
- Kedar Jadhav,
- Dinesh Karthik,
- Hardik Pandya,
- Bhuvneshwar Kumar,
- Jasprit Bumrah,
- Mohammed Shami.
- Yuzvendra Chahal,
- Kuldeep Yadav,
మరిన్ని తాజా సినీ ,క్రీడా వార్తల కోసం ప్రతీ రోజు సందర్శించండి
www.thribhuvanavijayam.com




0 comments:
Post a Comment