అయితే లండన్ కి చెందిన పేషెంట్ 2003 లో HIV వైరస్ బారిన పడి ఎయిడ్స్ గురి అయ్యాడు .అప్పటి నుండి అతడు రిట్రో వైరల్ డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు.అయితే అతడికి HIV వల్ల హడ్కిన్స్ లింఫోమా అనే ఎముక మజ్జ కాన్సర్ కి గురయ్యాడు.2016 లో అతడు స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్(వేరే వ్యక్తి ఎముక మజ్జ ను పేషెంట్ కి ఇవ్వడం ) కి ఒప్పుకున్నాడు. ఇది అందరి పేషెంట్ లలో విజయ వంతం కాదు. అంతే కాకుండా ఎవరైతే దాత ఉన్నాడో అతని కణాలు చాలా అరుదైన ఉతపరివర్తన కణాలు.అతడి జన్యు పదార్థము లో ఉన్న ఈ ఉత్పరివర్తన HIV వైరస్ కి అసంక్రామ్యత (IMMUNITY) ప్రదర్శించును.ఐనప్పటికీ ఈ హడ్కిన్స్ లింఫోమా వ్యాధి గ్రస్తులు ఎవ్వరికీ ఈ మూలకణాల మార్పిడి విజయవంతం కాలేదు .ఈ లండన్ పేషెంట్ కి ఈ మార్పిడి విజయవంతం కావడమే కాకుండా ఆ దాత కణాల లోని జన్యు ఉత్పరివర్తన వల్ల ఈ పేషెంట్ లో HIV వైరస్ కి అతడు ఇమ్యునిటీ ని పొందాడు.ఈ మార్పిడి తర్వాత వైద్యులు కొన్నాళ్ళకు అతడి దేహం లో HIV వైరస్ లేక పోవడాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు.ఈ పేషెంట్ ని వారు HIV మందులు ఆపివేశారు.ఎవరైనా HIV సోకిన వ్యక్తి మందులను ఆపివేస్తే కొన్ని రోజులలోనే HIV వైరస్ పేషెంట్ లో కనబడుతుంది.అయితే ఈ వ్యక్తి ని 18 నెలల పాటు అంటి రిట్రో వైరల్ డ్రగ్స్ తీసుకోకుండా ఉంచినప్పటికీ అతని లో HIV కనిపించలేదు. నిజంగా ఇదొక అసాదారణ మైన ,అద్భుతమైన విషయమని యునివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ కి చెందిన పరిశోధకుడు రవీంద్ర గుప్తా తెలిపాడు.
ఇలాగే అమెరికాకి చెందిన "తిమోతీ రే బ్రౌన్" అనే HIV పేషెంట్ 12 సంవత్సరాల క్రితం జర్మనీ లో చికిత్స పొంది HIV -AIDS నుండి విముక్తి పొందాడు. ఇవి రెండు కేసులలో మాత్రమే ఇలా జరిగింది .ఇది HIV పై పరిశోధనలను చేస్తున్న ఎంతోమంది శాస్త్రవేత్తలకి మరియు HIV పేషెంట్ లకి ఎన్నో ఆశలను కల్పిస్తున్నది.




0 comments:
Post a Comment